`మార్గదర్శి`లో రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు
తనిఖీల నేపథ్యంలో కొన్ని మార్గదర్శి బ్రాంచీల షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు. విధులకు వచ్చిన సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
మార్గదర్శి చిట్స్ బ్రాంచీల్లో వరుసగా రెండో రోజూ సీఐడీ తనిఖీలు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రంలోని పలు బ్రాంచీల్లో సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం కూడా తనిఖీలను కొనసాగిస్తున్నారు.
తనిఖీల నేపథ్యంలో కొన్ని బ్రాంచీల షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు. మార్గదర్శి బ్రాంచీల్లో విధులకు వచ్చిన సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులతో పాటు పలువురు ఏజెంట్లను కూడా విచారిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 16, 17 తేదీల్లో రామోజీ, శైలజా కిరణ్‌లను విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగా, వారు గైర్హాజరైన విషయం తెలిసిందే.
Advertisement