కుట్రలు చేస్తారు జాగ్రత్త.. సంయమనం కోల్పోవద్దు

చంద్రబాబు, ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కౌంటింగ్ రోజు మరింత గందరగోళం సృష్టిస్తారని హెచ్చరించారు సజ్జల.

Advertisement
Update:2024-06-02 15:30 IST

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన కీలక సూచనలు చేశారు. జూమ్ మీటింగ్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడిన ఆయన అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.


ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు సజ్జల. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, సంయమనం కోల్పోకుండా వారిని ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో నిబంధనల ప్రకారం వైసీపీకి రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ వేళ ప్రత్యర్థులు కుట్రలు చేస్తే వారి ఉచ్చులో పడొద్దన్ననారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తారని, అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి ఏజెంట్లకు చెప్పారు సజ్జల.

పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు సజ్జల. కచ్చితంగా మనమే గెలస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కౌంటింగ్ రోజు మరింత గందరగోళం సృష్టిస్తారని హెచ్చరించారు సజ్జల.

Tags:    
Advertisement

Similar News