అంపైర్ చూపు అటువైపే.. ఈసీపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు
కూటమి కట్టిన తర్వాత చంద్రబాబుకి వ్యవస్థలు సహకరించాయని, ఈసీ కూడా కూటమికి అనుకూలగా పలు నిర్ణయాలు తీసుకుందన్నారు సజ్జల.
ఎన్నికల కమిషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంపైర్ గా వ్యవహరించా
పోలింగ్ శాతం పెరగడం వైసీపీ విజయానికి సంకేతం అని చెప్పారు సజ్జల. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారు కూడా జగన్ కోసమే ఏపీకి వచ్చి ఓట్లు వేశారని, ఆయా పథకాలు కొనసాగాలని, అలా జరగాలంటే జగనే రావాలనేది వారి ఆలోచన అని అన్నారు. చంద్రబాబు హామీలను ఎవరూ నమ్మలేదన్నారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవడం సరికాదన్నారు సజ్జల.
కూటమి కట్టిన తర్వాత చంద్రబాబుకి వ్యవస్థలు సహకరించాయని, ఈసీ కూడా కూటమికి అనుకూలగా పలు నిర్ణయాలు తీసుకుందన్నారు సజ్జల. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న అల్లర్లకు ఈసీయే కారణం అని ఆరోపించారు. అధికారం వైసీపీ చేతుల్లో ఉన్నన్ని రోజులు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు టెక్నికల్ గా అధికారం ఈసీ చేతుల్లో ఉందని, వారు కూటమికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. తాము కుట్రలు చేయలేదని, తమ పార్టీ నేతలు ఓపెన్ గా ఉన్నారని, చంద్రబాబు పూర్తిగా నెగెటివ్ ప్రచారంపైనే ఆధారపడ్డారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని తామెప్పుడూ అనుకోలేదన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి, మేనిపులేట్ చేసి, పాడు చేయడం చంద్రబాబుకి అలవాటు అని అన్నారు. అలా చేసినా కూడా ఆయన గతంలో ఓడిపోయారని, అయినా బుద్ధి రాలేదని చెప్పారు సజ్జల.