వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో జాబితా విడుదల..

ఎంపీ గురుమూర్తికి తిరిగి తిరుపతి పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. తిరుపతి ఎంపీగా గతంలో ప్రకటించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు రెండు చోట్ల టికెట్ గల్లంతయింది.

Advertisement
Update:2024-01-31 21:12 IST

త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 58 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాల్లో ఇన్‌ఛార్జులను ప్రకటించింది. తాజాగా ఐదో జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు ఎంపీ స్థానాలతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌ఛార్జిలను ఫైనల్ చేసింది.

ఎంపీ గురుమూర్తికి తిరిగి తిరుపతి పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. తిరుపతి ఎంపీగా గతంలో ప్రకటించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు రెండు చోట్ల టికెట్ గల్లంతయింది. సత్యవేడు టికెట్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్‌ కుతూహలమ్మ కుటుంబ సభ్యుడు నూకతోటి రాజేష్‌కు కేటాయించారు. ఇక విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు.

తాజా లిస్టులో అసెంబ్లీ స్థానాలు

అరకు వాలీ - రేగం మత్స్య లింగం

అవనిగడ్డ - సింహాద్రి చంద్రశేఖర్ రావు

సత్యవేడు - నూకతోటి రాజేశ్‌

ఎంపీ స్థానాలు -

కాకినాడ - చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌

మచిలీపట్నం - సింహాద్రి రమేష్‌బాబు

నర్సరావుపేట - పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

తిరుపతి - గురుమూర్తి

Tags:    
Advertisement

Similar News