లోకేశ్‌పై సీనియర్ల తిరుగుబాటు.. ఇప్పుడు నాని.. నెక్ట్స్‌ ఆయనేనా.?

గతంలో పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం లోకేశ్‌ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు లోకేశ్ ఏ మాత్రం గౌరవం ఇవ్వడని.. ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

Advertisement
Update:2024-01-11 11:40 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారా..? లోకేశ్‌ వైఖరి కారణంగా సీనియర్లు ఇబ్బంది పడుతున్నారా..? తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని రాజీనామాతో ఈ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. వైసీపీ అధినేత జగన్‌తో సమావేశం అనంతరం మాట్లాడిన నాని ప్రధానంగా లోకేశ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. లోకేశ్‌ పార్టీలో సీనియర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడని.. తాను పార్టీని వీడడానికి ఒక రకంగా ఆయన వైఖరి కూడా కారణమని నాని స్పష్టంచేశారు.

ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేని ఆఫ్ట్రాల్‌ లోకేశ్‌ చెప్తే సీనియర్లు వినాలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నాని. విజయవాడలో తనను కాదని చిన్నీని తెరపైకి తీసుకురావడంలో లోకేశ్‌ కీలకమని నాని పరోక్షంగా చెప్పారు. చంద్రబాబు కుమారుడన్న అర్హత తప్పితే లోకేశ్‌కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు నాని. అలాంటి వ్యక్తి దగ్గర మోకరిల్లాలంటే తనలాంటి వ్యక్తులతో కాదన్నారు నాని.

ఇక పార్టీలో మరో సీనియర్ నేత అచ్చెన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారని సమాచారం. అచ్చెన్నకు, ఆయన మాటకు లోకేశ్ ఏ మాత్రం గౌరవం ఇవ్వట్లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం అచ్చెన్న తన వర్గానికి టికెట్లు కోరగా.. కనీసం లోకేశ్‌ పరిగణలోకి కూడా తీసుకోలేదని సమాచారం. దీంతో అచ్చెన్న లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం లోకేశ్‌ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు లోకేశ్ ఏ మాత్రం గౌరవం ఇవ్వడని.. ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక రాబోయే ఎన్నికల్లో బుచ్చయ్యకు సీటు ఇచ్చేది లేదని ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చేసిందని సమాచారం. బుచ్చయ్య చౌదరి సీటును జనసేనకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని, సీటు నిరాకరించే విషయంలో లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన సైతం పార్టీ తీరు, సీనియర్ల పట్ల లోకేశ్‌ వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News