చంద్రబాబును రామోజీయే తిట్టిస్తున్నారా..?

ప్రత్యేకహోదా కోసం జగన్ ఏమీ ప్రయత్నం చేయటం లేదన్నారు. దానికి సాక్షిలో కౌంటరుగా చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రత్యేకహోదా డిమాండ్ మంటకలిసిపోయిందని రాశారు.

Advertisement
Update:2023-07-06 11:00 IST

చంద్రబాబును రామోజీయే తిట్టిస్తున్నారా..?

వినటానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. జాగ్రత్తగా, లాజికల్‌గా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎల్లోమీడియాలో రామోజీరావు ప్రతిరోజూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు ఇస్తున్నారు. రైతులకు పంటలబీమా అందటంలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు అందటంలేదని, భూములను ఆక్రమించేస్తున్నారని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించటంలేదని, ఓ ఊరిలో దొంగఓట్లు రాయిస్తున్నారని, పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోవటంలేదని.. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక అంశాన్ని బ్యానర్ కథనంగా హైలైట్ చేస్తున్నారు.

రామోజీ ఉద్దేశం ఏమిటంటే.. ప్రజలముందు జగన్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే. ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని దాచిపెట్టేసి కేవలం నెగిటివ్ కోణాన్ని మాత్రమే ప్రొజెక్టు చేయాలన్న అజెండాతోనే రామోజీ వెళ్తున్నారు. అజెండా పెట్టుకోవటంవరకు బాగానే ఉన్నా అదంతా చివరకు రివర్సుకొట్టి చంద్రబాబునాయుడుకు తగులుతోందన్న విషయాన్ని మరచిపోతున్నారు. జగన్ హయాంలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయని రామోజీ రాస్తున్నారో.. అవే తప్పులు ఇంతకుమించి చంద్రబాబు హ‌యాంలో జరిగాయి.

ఇదే సమయంలో చంద్రబాబు చేసిన తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేసి గబ్బుపట్టిద్దామని రామోజీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఉదాహరణకు ప్రత్యేకహోదా కోసం జగన్ ఏమీ ప్రయత్నం చేయటం లేదన్నారు. దానికి సాక్షిలో కౌంటరుగా చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రత్యేకహోదా డిమాండ్ మంటకలిసిపోయిందని రాశారు. నిజానికి ప్రత్యేకహోదా రాలేదంటే అందుకు కారణం చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలుసు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నరేంద్రమోడీ సర్కార్ చెబితే ఒప్పుకున్నది చంద్రబాబే.

విశాఖపట్నం రైల్వేజోన్ కు బదులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామంటే ఒప్పుకున్నది కూడా చంద్రబాబే. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని బలవంతంగా లాక్కుని నాశనం చేసేసింది చంద్రబాబే అని అందరికీ తెలుసు. దెబ్బ‌తిన్న‌ డయాఫ్రంవాల్ కూడా రామోజీ కొడుకు వియ్యంకుడు కట్టిన నవయుగ సంస్థే అని జనాలకు తెలుసు. ఇప్పుడు రామోజీ రాతల వల్ల ఏమవుతోందంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతో జగన్ మీడియా చంద్రబాబును పిక్చర్లోకి లాగి ఇద్దరినీ కలిపి వాయించేస్తోంది. అంటే తన రాతలతో రామోజీయే చంద్రబాబును సాక్షి మీడియాతో తిట్టిస్తున్నట్లవుతోంది.

Tags:    
Advertisement

Similar News