స్కూళ్లు బాగుచేస్తున్నా రామోజీకి ఏడుపేనా..?
వేల స్కూళ్ళ రూపురేఖలు మార్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎల్లోమీడియాకు తెలీదా..? జగన్ ఐదేళ్ళ పాలనలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారికే పోయింది కదా.
రాష్ట్రంలో ఎల్లో మీడియా ఏడుపు పీక్స్ కు చేరుకుంటోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేసినా ఏడుపే, ఏమీ చేయకపోయినా ఏడుపే అన్నట్లుగా తయారైంది. తాజా ఏడుపు ఏమిటంటే.. నాలుగున్నరేళ్ళు గడచినా రాష్ట్రంలో నాడు-నేడు పథకంలో 32 వేల స్కూళ్ళు బాగు కాలేదట. కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు చెట్లకిందే కూర్చుని చదువుకుంటున్నారని ఒక ఫొటో వేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జగన్ వచ్చిన దగ్గర నుండి విద్య, వైద్యానికి బాగా ప్రాధాన్యతిస్తున్నారు.
స్కూళ్ళ రూపురేఖలను మార్చే ఉద్దేశ్యంతోనే దాదాపు 45 వేల స్కూళ్ళ భవనాలు, సౌకర్యాలను సమూలంగా మార్చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి సుమారు 30 వేల స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా రెడీఅయ్యాయి. రాజకీయాలతో సంబంధంలేని, వాస్తవాలను గుర్తించగలిగిన జనాలందరు జగన్ కారణంగా మారిన, మారుతున్న స్కూళ్ళను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక్క ఎల్లోబ్యాచ్ మాత్రమే గుక్కపట్టి ఏడుస్తోంది. స్కూళ్ళు బాగు కావటాన్ని తట్టుకోలేకపోతోంది. ఇప్పుడు ఎల్లోమీడియా ఏడుపులో అదే కనబడింది.
ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే ఎంతకాలం పడుతుంది..? అన్నీ అనుమతులుండి, చేతిలో డబ్బుండి, మ్యాన్ పవరుండి, వాతావరణం కూడా అనుకూలిస్తే తక్కువలో తక్కువ 8 మాసాలు పడుతుంది. అలాంటిది వేల స్కూళ్ళ రూపురేఖలు మార్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎల్లోమీడియాకు తెలీదా..? జగన్ ఐదేళ్ళ పాలనలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారికే పోయింది కదా. అంటే మిగిలిన మూడేళ్ళ కాలంలోనే, లోటు బడ్జెట్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగన్ ఇన్ని వేల స్కూళ్ళని బాగుచేయించారంటే అభినందించాల్సింది పోయి ఎల్లోమీడియా ఏడుస్తోంది.
‘డప్పు ఆపి డబ్బులివ్వు మామా’ అనే బ్యానర్ స్టోరీలో స్కూళ్ళు బాగుపడిపోతున్నాయన్న ఏడుపే కనబడింది. భవనాలు లేక రేకుల షెడ్లు, చెట్ల కింద తరగతులు నడుస్తున్నాయని ఆరోపిస్తున్న ఎల్లోమీడియాకు చంద్రబాబునాయుడు ఫెయిల్యూర్ కనబడలేదా..? జగన్ హయాంలో స్కూళ్ళ భవనాలు దీనస్ధితిలో ఉన్నాయంటే అందుకు చంద్రబాబు కూడా బాధ్యత వహించాల్సిందే కదా? ఎందుకంటే జగన్ సీఎం అయ్యింది ఐదేళ్ళ క్రితమే. కానీ ఘనతవహించిన ప్రపంచ మేథావి 14 ఏళ్ళు సీఎం చేశారు కదా. తన హయాంలో చంద్రబాబు స్కూళ్ళని బాగుచేసుంటే జగన్ కు ఇప్పుడీ అవకాశం ఉండేది కాదు కదా.