హిట్లర్ వ్యాన్ పై వివేకానందుడు.. వారాహిపై వర్మ కౌంటర్లు

పవన్ కల్యాణ్ వస్త్రధారణపై కౌంటర్లు వేశారు వర్మ. ఆయన వివేకానందుడి గెటప్ లో వచ్చారన్నారు. వివేకానందుడి ఫొటో పవన్ ఫొటోకి పక్కనపెట్టి బలవంతుడైన వివేకానందుడు అనే క్యాప్షన్ పెట్టారు.

Advertisement
Update:2023-01-25 06:33 IST

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి రోడ్డుపైకొచ్చింది. కొండగట్టు ఆంజనేయ స్వామి వద్ద వాహనానికి పూజ చేశారు. ఆ తర్వాత తెలంగాణ నేతలతో పవన్ సమావేశమై, తన అనుష్టుమ్ నారసింహ యాత్ర మొదలు పెట్టారు. తెలంగాణలో పొత్తులు కావాలన్నారు, ఏపీలో బీజేపీతోనే పొత్తులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఇదీ క్లుప్తంగా నిన్న జరిగిన జనసేన అప్డేట్. దీనిపై వైసీపీ నేతలు పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుస ట్వీట్లతో పవన్ ని ఓ ఆట ఆడేసుకున్నారు. పవన్ కల్యాణ్ వస్త్ర ధారణ నుంచి, పవన్ వాహనం వరకు ఆయన అన్నిటిపై కౌంటర్లు వేశారు.


హిట్లర్ వ్యాన్ పై..

పవన్ కల్యాణ్ వస్త్రధారణపై కౌంటర్లు వేశారు వర్మ. ఆయన వివేకానందుడి గెటప్ లో వచ్చారన్నారు. వివేకానందుడి ఫొటో పవన్ ఫొటోకి పక్కనపెట్టి బలవంతుడైన వివేకానందుడు అనే క్యాప్షన్ పెట్టారు. ఇక వారాహి వాహనంపై పవన్ ప్రసంగించడంపై కూడా వర్మ సెటైర్ పేల్చారు. హిట్లర్ వాహనంపై వివేకానందుడి ప్రసంగం అంటూ కామెడీ క్యాప్షన్ పెట్టారు.


పందిబాసు వారాహి..

పవన్ వారాహి వాహనం పేరుపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పందిబాసు వారాహి అనే హ్యాష్ ట్యాగ్ ని చాలామంది ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. దీనిపై వర్మ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్టుగానే కౌంటర్లు ఇచ్చారు. ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నవారిపై కేసులు పెట్టాలంటూ తాను కూడా పందిబాసు వారాహి అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ చైతన్య రథంపై తిరిగితే, పవన్ కల్యాణ్ పంది బస్సుపై తిరుగుతున్నారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారని, అలాంటి వారందర్నీ వారాహి వాహనం టైర్ల కింద వేసి తొక్కించేయాలని, కుదరకపోతే కేసులు పెట్టాలని సూచించారు.


తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూనే పవన్ వారాహి వాహనంపై విమర్శలు సంధించారు రామ్ గోపాల్ వర్మ. వైసీపీ నాయకులంతా నిన్న లోకేష్ పాదయాత్రపై కామెంట్లు చేసే విషయంలో బిజీగా ఉన్నారు. పవన్ ని ఎగతాళి చేసే బాధ్యత రామ్ గోపాల్ వర్మ తీసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News