అది రాజమండ్రి జైలు.. వెల్ నెస్ సెంటర్ కాదు

చంద్రబాబు డీహైడ్రేషన్ వార్తలపై వైసీపీనుంచి కౌంటర్లు పడుతున్నాయి. రాజమండ్రి జైలుని వెల్ నెస్ సెంటర్ అనుకోవద్దంటున్నారు వైసీపీ నేతలు.

Advertisement
Update:2023-10-11 12:10 IST

చంద్రబాబు డీహైడ్రేషన్ వార్తలపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్ లో కాదని, రాజమండ్రి జైలులో అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నేరం చేసినవాళ్లకోసమే జైళ్లు ఉన్నాయని చెప్పారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు మంత్రి గుడివాడ. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారం కేవలం సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నం అని మండిపడ్డారు.

రంభ, ఊర్వశి, రాజమండ్రి జైలు

చంద్రబాబుకి జైలులో దోమలు కుడుతున్నాయని, స్నానానికి వేడినీళ్లు లేవని.. గతంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కూడా వైసీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి. జైలులో దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి వచ్చి కన్ను కొడతారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు డీహైడ్రేషన్ వార్తలపై కూడా అదే స్థాయిలో వైసీపీ నేతలు బదులిస్తున్నారు. రాజమండ్రి జైలు వెల్ నెస్ సెంటర్ కాదని చెప్పారు మంత్రి గుడివాడ.

ఆయన సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావి..

సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. దొంగతనం చేసిన వాళ్లు వెంటనే నిజం చెప్పరని అన్నారు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం గురించే ఉంటాయి కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదని ఎద్దేవా చేశారు. మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని లోకేష్ కి హితవు పలికారు. చంద్రబాబుతోపాటు లోకేష్ కి కూడా శిక్ష పడడం ఖాయమన్నారు మంత్రి గుడివాడ. 

Tags:    
Advertisement

Similar News