ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

అల్పపీడన ప్రభావంతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక

Advertisement
Update:2024-12-03 14:49 IST

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీతో పాటు యానంలోనూ ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తరకోస్తాతో పాటు యానాంలో మంగళ, బుధవారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గురువారం కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News