RRRకు టైమొచ్చింది.. జగన్‌పై రివర్స్ కేసు!

సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది.

Advertisement
Update:2024-06-11 11:27 IST

రఘురామకృష్ణంరాజుకు టైమొచ్చింది. గత కొన్నేళ్లుగా వైసీపీపై, ఆ పార్టీ అధినేత జగన్‌పై పీకల దాకా పగ పెంచుకున్న RRR.. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే తన ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణం రాజు.. కొత్త ప్రభుత్వంలో స్పీకర్‌ లాంటి కీలకపదవిపైనా కన్నేశారు.


ఇక తాజాగా తన పగ తీర్చుకునే పనిలో పడ్డారు రఘురామకృష్ణంరాజు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసు బనాయించి హింసించారంటూ మాజీ సీఎం జగన్‌తో పాటు సీఐడీ చీఫ్ పి.వి.సునీల్ కుమార్‌తో పాటు ఇతర అధికారులపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో తనపై సీఐడీ అధికారులు దాడి చేశారని రఘురామ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన ఫిర్యాదుకు జమ చేశారు. తనపై హత్యాయత్నంతో పాటు కస్టడీలో తనను తీవ్రంగా హింసించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన 2021లో జరిగిందని వివరించారు రఘురామ.


ఐతే సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్ర పెద్దలతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని రఘురామ చెప్పుకుంటారు. దీంతో తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని రఘురామ భావిస్తున్నారు. మరీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదును పోలీసులు పరిగణలోకి తీసుకుని ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News