పురందేశ్వరి వక్రబుద్ది బయటపడిందా..?
స్కూళ్ళని 21వ తేదీన ప్రారంభించాలని ఆదేశించింది. వాస్తవం ఇదైతే పురందేశ్వరి మాత్రం జగన్ ప్రభుత్వం దురుద్దేశ్యం బయటపడిందని బురదచల్లేస్తోంది. జగన్ ప్రభుత్వానికి ఉన్న దురుద్దేశ్యం ఏమిటో ఆమె బయటకు చెప్పలేదు.
ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన బురదచల్లేద్దామా అని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎదురుచూస్తుంటారు. అందుకనే అనవసరమైన విషయాల్లో కూడా జగన్ను లాగేసి గబ్బుపట్టించే పనిలో పడ్డారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో స్కూళ్ళకి 22వ తేదీన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోందట. ఆ ఘట్టాన్ని అందరూ చూడటానికి వీలుగా జగన్ స్కూళ్ళకి సెలవులు ప్రకటించాలట. సంక్రాంతి పండుగకు సెలవులిచ్చిన ప్రభుత్వం సరిగ్గా 21వ తేదీనే పునఃప్రారంభించటంలో దురుద్దేశ్యం బయటపడిందని ఆరోపించారు.
ఇక్కడ బయటపడింది జగన్ దురుద్దేశ్యం కాదు పురందేశ్వరి వక్రబుద్దే. మామూలుగా సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది 11వ తేదీ నుండి 16వ తేదీ వరకే. అయితే గతంలో పదిరోజులుండే సెలవులను ప్రభుత్వాలు తగ్గించేశాయి కాబట్టి మళ్ళీ పదిరోజులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండును సమీక్షించిన ప్రభుత్వం సరే అని మరో మూడురోజులు పొడిగించింది. దాంతో విద్యార్ధులకు సెలవులు 9నుండి 18 వరకు డిసైడ్ అయ్యింది. 19వ తేదీనుండి స్కూళ్ళు తెరవాల్సుండగా పిల్లలు రాలేరు కాబట్టి మరో మూడు రోజులు సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు అడిగితే వేరే దారిలేక ప్రభుత్వం ఒప్పుకున్నది.
అందుకనే స్కూళ్ళని 21వ తేదీన ప్రారంభించాలని ఆదేశించింది. వాస్తవం ఇదైతే పురందేశ్వరి మాత్రం జగన్ ప్రభుత్వం దురుద్దేశ్యం బయటపడిందని బురదచల్లేస్తోంది. జగన్ ప్రభుత్వానికి ఉన్న దురుద్దేశ్యం ఏమిటో ఆమె బయటకు చెప్పలేదు.
పురందేశ్వరి అనుకుంటున్న ప్రభుత్వ దురుద్దేశ్యం ఏమిటంటే.. జగన్ క్రిస్టియన్ కాబట్టే 22వ తేదీన స్కూళ్ళకి సెలవు ఇవ్వలేదని. 22వ తేదీన స్కూళ్ళు తెరుస్తున్నారంటేనే ప్రభుత్వ దురుద్దేశ్యం అర్థమవుతోందని ఆమె బురదచల్లేశారు. సంక్రాంతి సెలవులను 21 వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. రెండుసార్లు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తేనే సెలవులు పొడిగించింది. ఇందులో ప్రభుత్వ దురుద్దేశ్యం ఏముందో అర్థంకావటంలేదు. ఇక్కడే పురందేశ్వరి వక్రబుద్ది బయటపడింది.