పులివెందుల పూలంగళ్ల సెంటర్..

పులివెందులలో పూలంగళ్ల సెంటర్ ఇప్పటి వరకూ ఆ ప్రాంతంవారికే తెలుసు. ఇప్పుడది రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో పులివెందుల పూలంగళ్ల సెంటర్లో జరిగిన ఘటన వైరల్ గా మారింది.

Advertisement
Update:2023-08-02 20:44 IST

చంద్రబాబు కడప జిల్లా పర్యటన కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులలో పూలంగళ్ల సెంటర్ ఇప్పటి వరకూ ఆ ప్రాంతంవారికే తెలుసు. ఇప్పుడది రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో పులివెందుల పూలంగళ్ల సెంటర్లో జరిగిన ఘటన వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగింది..?

"సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి" కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు, పులివెందుల నుంచి వెళ్లారు. పులివెందులలో బహిరంగ సభకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే పులివెందులలో టీడీపీ కార్యకర్తలు బాగానే హడావిడి చేశారు. చంద్రబాబు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. ఇంతలో పూలంగళ్ల సెంటర్ కి ఓ కారు దూసుకొచ్చింది. అందులోనుంచి వైసీపీ జెండాలు తీసిన కొంతమంది అక్కడ వాటిని ఊపుతూ సందడి చేశారు.. మీసం మెలేస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పులివెందుల గడ్డ జగనన్న అడ్డా అంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లలో ఆ వీడియో వైరల్ గా మారింది.


ఇక టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో మరో రకంగా ట్రోల్ అవుతోంది. పులివెందుల పూలంగళ్ల సెంటర్ కి వచ్చిన వైసీపీ కార్యకర్తల్ని టీడీపీ నేతలు తరిమికొట్టారంటూ టీడీపీ పోస్టింగ్ పెట్టింది. వైసీపీ వాళ్లు జెండాలు పట్టుకుని ఎగరేసింది నిజమే, మీసం మెలేసి సవాల్ విసిరిందీ నిజమే. టీడీపీవాళ్లు ఆ కారుని కొంతదూరం తరుముకోవడం కూడా నిజమే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి అనుకూలంగా వారు ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. 



Tags:    
Advertisement

Similar News