తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ సంచలన ట్వీట్

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు.

Advertisement
Update:2024-09-20 19:47 IST

శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యు ఇది. ఎంక్వరీ చేయండి. దయచేసి విచారించండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అయితే ప్రకాశ్ రాజ్ పోస్ట్ తో ప్రస్తుతం ఈ వ్యవహారం నేషనల్ లెవల్ లో వైరల్ అవుతుంది.

కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో జరుగుతున్న మత కల్లోలాలు చాలు అని ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని ప‌వ‌న్‌ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చేల‌రేగింది.

Tags:    
Advertisement

Similar News