పవర్ స్టార్ విస్కీ.. సృష్టికర్త జగనా..? చంద్రబాబా..?

'పవర్ స్టార్' బ్రాండ్ విస్కీ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉందా..? ఉంటే ఎక్కడ..? ఎవరు దాని సృష్టికర్త..?

Advertisement
Update: 2024-07-02 10:14 GMT

ఏపీలో ఇప్పుడు 'పవర్ స్టార్' విస్కీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఇది కొత్త సరుకు అంటూ వైసీపీ సెటైర్లు పేలుస్తోంది. గెలిస్తే నాణ్యమైన మద్యం అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు జనసైనికుల్ని మెప్పించేందుకు 'పవర్ స్టార్' అనే పేరుతో విస్కీని ప్రవేశ పెట్టారని వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టింగ్ లు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ పవర్ స్టార్ విస్కీ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉందా..? ఉంటే ఎక్కడ..? ఎవరు దాని సృష్టికర్త..?

గతంలో వైసీపీ హయాంలో ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ అనే పేర్లతో మద్యం అమ్మకాలు జరిగినప్పుడు టీడీపీ నుంచి ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగేది. ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేని జగన్, మద్యం బ్రాండ్ మాత్రం తీసుకొచ్చారని కౌంటర్లిచ్చేవారు. ఇప్పుడు పవర్ స్టార్ అనే పేరు కనపడటంతో వైసీపీ కూడా అడ్వాంటేజ్ తీసుకుంది. చంద్రబాబుని టార్గెట్ చేసేలా ట్వీట్ వేసింది. అయితే అక్కడే వైసీపీ పప్పులో కాలేసింది.


ఆ బ్రాండ్ సృష్టికర్త ఎవరు..?

పవర్ స్టార్ అనే బ్రాండ్ ఇప్పటిది కాదని, అది వైసీపీ హయాంలోనే ఉన్నదనే అసలు నిజాన్ని బయటపెట్టారు కూటమి నేతలు. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయంపై స్పందించారు. ఆఖరికి తన పేరుతో కూడా మద్యం బ్రాండ్ తీసుకొచ్చారంటూ వైసీపీని విమర్శించారు. ఎన్నికల ముందు పవర్ స్టార్ అనే బ్రాండ్ ఉండగా, ఎన్నికల తర్వాత దాన్ని కొత్తగా కూటమి ప్రభుత్వం తెచ్చినట్టు వైసీపీ ప్రచారం చేయడం వింతగా ఉంది. దీంతో టీడీపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టింది.


పలువురు జనసైనికులు కూడా ఈ విషయంలో వైసీపీని కాస్త గట్టిగానే టార్గెట్ చేశారు. ఫేక్ ప్రచారాలు ఇకనైనా ఆపండి అంటున్నారు. వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాల్లో ఇలాంటి ఫేక్ ప్రచారం జరిగినా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వైసీపీ అధికారిక ఖాతాలోనే ఇలాంటి ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అందులోనూ ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ అంటే గతంలో రచ్చ చేసిన వైసీపీ ఇప్పుడు పవర్ స్టార్ బ్రాండ్ చూడగానే వెటకారం చేయాలనుకోవడం విశేషం.  



Tags:    
Advertisement

Similar News