చంద్రబాబు ఆటలో అరటిపండేనా?

రాజకీయంగా చంద్రబాబును దెబ్బకొడితే రామోజీకి ఎలాంటి నష్టం ఉండదు. అదే రామోజీని ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొడితే దాని ప్రభావం చంద్రబాబు మీద కచ్చితంగా పడుతుందని జగన్‌కు బాగా అర్థ‌మైంది.

Advertisement
Update:2023-07-31 11:09 IST

రాజకీయంగా తన అసలు ప్రత్యర్థి ఎవరు? కొసరెవరు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్సేసినట్లే. తాజాగా ప్రభుత్వం జారీచేసిన యాడ్స్ తో ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా ప్రకటించారు. మార్గదర్శికి వ్యతిరేకంగా ప్రభుత్వం కొన్ని దినపత్రిల్లో ఫుల్ పేజి యాడ్స్‌ ఇచ్చింది. అందులో మార్గదర్శి యాజమాన్యం చేసిన, చేస్తున్న అవినీతి, అక్రమాలను పాయింట్ల రూపంలో ఇచ్చింది. చందాదారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం వల్లే ప్రభుత్వం మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐడీ ప్రకటించింది.

తాజా ప్రకటన చూసిన తర్వాత రామోజీ ఆర్థిక మూలాలను సమూలంగా పెక‌లించటమే జగన్ టార్గెట్‌గా అర్థ‌మవుతోంది. తన అసలు ప్రత్యర్థి రామోజీయే కానీ చంద్రబాబునాయుడు ఎంతమాత్రం కాదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఎందుకంటే చంద్రబాబు కూడా రామోజీ చెప్పినట్లు ఆడుతున్న వ్యక్తేకానీ స్వయం ప్రకాశంలేదని జగన్ గ్రహించారు. రాజకీయంగా చంద్రబాబును దెబ్బకొడితే రామోజీకి ఎలాంటి నష్టం ఉండదు. అదే రామోజీని ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొడితే దాని ప్రభావం చంద్రబాబు మీద కచ్చితంగా నెగిటివ్‌గా పడుతుందని జగన్‌కు బాగా అర్థ‌మైంది.

అందుకనే రామోజీని వరుసబెట్టి దెబ్బలు కొడుతున్నది. మార్గదర్శిని గనుక జగన్ దెబ్బకొడితే రామోజీ గ్రూపు మొత్తం కుప్పకూలిపోతుంది. అందుకనే మార్గదర్శిని కాపాడుకోవటంలో భాగంగా రామోజీ కూడా జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తనకు చేతనైన రీతిలో వ్యతిరేకత వార్తలు, కథనాలతో విరుకుపడుతున్నారు. అయితే రామోజీకి అర్థంకాని విషయం ఏమిటంటే జనాలు ఎల్లో మీడియాను నమ్మటం మానేసి చాలా కాలమైందని.

ఇప్పుడు నడుస్తున్నది మీడియా కాలం కాదు సోషల్ మీడియా కాలమని రామోజీ గుర్తించారో లేదు. నిజమేదో అబద్ధమేదో జనాలు సోషల్ మీడియాలో వస్తున్న రెండు వైపుల సమాచారాన్ని చదివి అర్థం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియా ఇవ్వని సమాచారాన్ని, చెప్పని విషయాలను జనాలకు సోషల్ మీడియా అందిస్తోంది. రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేయాల్సింది ఎల్లో మీడియా యాజమాన్యాలతోనే కానీ చంద్రబాబుతో కాదని జగన్‌కు బాగా తెలుసు. అందుకనే ఔట్ అండ్ ఔట్ రామోజీపై యుద్ధానికి దిగేశారు. మరి యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News