హత్యాయత్నమే..! రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..

సీఎంను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారని అంటున్నారు.

Advertisement
Update:2024-04-18 20:27 IST

సీఎం జగన్ పై జరిగిన దాడి ఆకతాయిల పని కాదని, అది హత్యాయత్నమేనన్నారు పోలీసులు. నిందితుడు సతీష్ ని కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో పోలీసుల తరపు న్యాయవాదులు అది దురుద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాయి మైనర్‌ అని, అతనికి నేర చరిత్ర లేదని నిందితుడి తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. 307 సెక్షన్‌ ఈకేసులో వర్తించదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి మే 2 వరకు రిమాండ్ విధించింది.

రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది..?

రిమాండ్ రిపోర్ట్ లో పలు సంచలన విషయాలున్నట్టు తెలుస్తోంది. సీఎంను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారని అంటున్నారు.మొదట డాబా కొట్ల సెంటర్ లో దాడికి సిద్ధమైన సతీష్, రాయి బయటకు తీసినా.. ఫ్రెండ్ వారించాడని, తోపులాట ఉండటంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత వివేకానంద స్కూల్ దగ్గర దాడి ప్లాన్ వర్కవుట్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మధ్యలో దుర్గారావు

ఇక సతీష్ దాడి వెనక దుర్గారావు అనే వ్యక్తి హస్తం ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం జగన్ పై దాడి చేస్తే దుర్గారావు డబ్బులిస్తానన్నారని, ఆ తర్వాత అతను కనపడకుండా పోయారని సతీష్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దుర్గారావు ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో సతీష్ ని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గారావుని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

Tags:    
Advertisement

Similar News