అనకాప‌ల్లి సెజ్ లో మళ్ళీ విష వాయువు లీక్‌... 50 మంది మ‌హిళ‌ల‌కు అస్వస్థ‌త‌

అచ్యుతాపురం సెజ్ లో మళ్ళీ గ్యాస్ లీక్ అయ్యింది. గతంలో గ్యాస్ లీక్ అయిన సీడ్స్ దుస్తుల‌ ప‌రిశ్ర‌మలోనే సేమ్ సంఘటన రిపీట్ అయ్యింది. దాంతో 50 మంది మహిళా కార్మికులు అస్వ‌స్థ‌తకు గురయ్యారు.

Advertisement
Update:2022-08-02 21:00 IST

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మళ్ళీ విష వాయువు లీక్ అయ్యింది. సీడ్స్ దుస్తుల‌ ప‌రిశ్ర‌మలో విష వాయువు లీక్ అవడంతో అక్కడ పనిచేస్తున్న 50 మంది మహిళలు అస్వ‌స్థ‌తకు గురయ్యారు. వాంతులు, వికారంతో పలువురు స్పృహతప్పి పడిపోయారు. కొందరికి పరిశ్రమ ఆవరణలోనే ప్రథమ చికిత్స చేయగా పలువురిని ఆస్పత్రికి తరలించారు.

మే నెలలో కూడా ఇదే పరిశ్రమలో విష వాయువు లీక్ అయ్యి అనేకమంది మహిళలు అస్వ‌స్థ‌తకు గురయ్యారు. అప్పుడు ఈ పరిశ్రమను అధికారులు వారం రోజుల పాటు మూసివేసి విచారణ జరిపారు. అయితే ఆ విచారణ ఫలితాలేంటో ఇప్పటి వరకు తెలియరాలేదు. 

Tags:    
Advertisement

Similar News