మరోసారి హైకోర్టుకు పిన్నెల్లి.. ఈసారి ఎందుకంటే?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 307 కింద ఆయనను ప్రధాన నిందితుడిగా FIRలో చేర్చారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు తలుపులు తట్టారు. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి పిటిషన్‌పై ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు పిన్నెల్లి.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 307 కింద ఆయనను ప్రధాన నిందితుడిగా FIRలో చేర్చారు. కాగా, రాజకీయ కక్షతోనే తనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు పిన్నెల్లి.
మరోవైపు ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించింది. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు కూడా విధించింది.