హోమ్ టూర్ చేద్దాం.. లోకేష్‌కు నాని సవాల్
చంద్రబాబు కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణితో పాటు మనవడు దేవాన్ష్‌కు సైతం 4 ప్లస్ 4 గన్‌మెన్లను ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు.
అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం ఆగడం లేదు. తాజాగా జగన్ సెక్యూరిటీ 986 మంది ఉన్నారంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 196 మంది మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని స్పష్టం చేశారు. అంతకంటే అదనంగా ఒక్కరూ కూడా లేరని చెప్పారు నాని. లోకేష్, చంద్రబాబు వెళ్తుంటే పోలీసులు సెక్యూరిటీగా ఉండడం లేదా అని ప్రశ్నించారు పేర్ని నాని.
2014 - 19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఖర్చులు ఎంత అయ్యాయో బయటపెట్టాలన్నారు నాని. చంద్రబాబు కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణితో పాటు మనవడు దేవాన్ష్‌కు సైతం 4 ప్లస్ 4 గన్‌మెన్లను ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. ఇక లోటస్‌పాండ్‌లో ఆక్రమణలు పడగొడితే జగన్‌కు ఏం సంబందం అన్నారు నాని. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాత్కాలిక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేస్తే దాన్ని తొలగించారని స్పష్టం చేశారు
ఇక లోకేష్‌కు దమ్ముంటే జూబ్లిహిల్స్‌లోని నివాసాన్ని చూపించాలని సవాల్ విసిరారు పేర్ని నాని. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కమిటీ వేయాలన్నారు. జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు ఇల్లుతో పాటు జగన్ ఇంటి విలువను లెక్కించాలన్నారు నాని. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కనీసం గృహప్రవేశానికి చంద్రబాబు భోజనాలు కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు నాని. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కరకట్ట వైపు ఎవరినైనా రానిచ్చారా అంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల వయస్సులో NTR వయాగ్రా వాడుతున్నారని చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు నాని. అధికార కాంక్ష కోసం చంద్రబాబు ఎదుటివారి వ్యక్తిత్వహననం చేస్తారని మండిపడ్డారు నాని.