ఇప్పుడు కూడా అడ్డదిడ్డమైన సమర్థింపేనా ?
మిస్సవుతున్న వాళ్ళకి వాలంటీర్లకు సంబంధాలు లేవని. బాలికలు, మహిళలు మిస్సవుతున్నారని మాత్రమే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకానీ మిస్సవుతున్న వాళ్ళంతా వాలంటీర్ల వల్లే మిస్సవుతున్నట్లు చెప్పలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర్థింపు భలే విచిత్రంగా ఉంది. ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ 2019-21 మధ్య ఏపీలో సుమారు 30 వేలమంది మహిళలు, బాలికలు మిస్సయ్యారని ప్రకటించారు. తెలంగాణలో అదృశ్యమైన బాలికలు, మహిళల సంఖ్య 42 వేలుగా చెప్పారు. ఏ సంవత్సరంలో ఎంతమంది మిస్సయ్యారనే వివరాలను సంఖ్యలతో సహా కేంద్రమంత్రి వివరించారు. దాన్ని పట్టుకుని పవన్ రెచ్చిపోతున్నారు.
వారాహియాత్రలో తాను చెప్పిందాన్నే ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా చెప్పిందంటూ ట్వీట్ చేశారు. తాను చెప్పిన మాటను నిరాధార ఆరోపణలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రప్రభుత్వం మీద, మహిళా కమిషన్ మీద చర్యలు తీసుకోగలదా అనే అడ్డదిడ్డమైన సమర్థింపులకు దిగటమే విచిత్రంగా ఉంది. పవన్ ఇక్కడ మరచిపోతున్న విషయాలు రెండున్నాయి. అవేమిటంటే మొదటిది మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు.
అలాగే మిస్సవుతున్న వాళ్ళకి వాలంటీర్లకు సంబంధాలు లేవని. బాలికలు, మహిళలు మిస్సవుతున్నారని మాత్రమే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకానీ మిస్సవుతున్న వాళ్ళంతా వాలంటీర్ల వల్లే మిస్సవుతున్నట్లు చెప్పలేదు. వారాహియాత్రలో పవన్ చెప్పిందేమిటంటే వేలాదిమంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతున్నట్లు ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమన్నారు. సమస్యంతా హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతోందని, అందుకు వాలంటీర్లే కారణమని పవన్ ఆరోపించటమే.
కేంద్ర హోంశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని చెప్పలేదు. మిస్సింగ్ అంటే ప్రేమలు, ప్రేమ పెళ్ళిళ్ళు, ఇంట్లో వాళ్ళు ఇష్టంలేని వివాహాలు చేస్తున్నారని, పరీక్షల్లో ఫెయిలవ్వటం లాంటి అనేక కారణాలతో అమ్మాయిలు ఇంట్లోనుండి వెళ్లిపోతుంటారు. వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. దాన్ని పోలీసులు మిస్సింగనే పరిగణిస్తారు. ఓ మూడు, నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోయిన ప్రతి 100 అమ్మాయిల్లో 95 మంది వెనక్కు వచ్చేస్తారు. అయితే అమ్మాయిలు వెనక్కు వచ్చేసినట్లుగా పోలీస్‌స్టేషన్ కు వెళ్ళి సమాచారం ఇచ్చే తల్లిదండ్రులు తక్కువమందుంటారు. అందుకనే రిజిస్టర్ లో మిస్సింగ్ కేసులు అలాగే ఉండిపోతాయి. మిస్సింగుకు, హ్యూమన్ ట్రాఫికింగ్ కు చాలా తేడా ఉందని పవన్ తెలుసుకుంటే బాగుంటుంది.