తొలిగిని ముసుగు.. జనసైనికులకు పిచ్చ క్లారిటీ
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఎవరైనా నోరుజారితే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరు ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. తాను తీసుకునే నిర్ణయాలు ఎవరికైనా ఇష్టంలేక వాళ్ళు ఇప్పుడే పార్టీలో నుండి వెళ్ళిపోవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.
ఇంతకాలం ప్రశ్నించేతత్వం అనే ముసుగు వేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ముసుగును తీసేశారు. దాంతో పవన్ అసలు వైఖరి బయటపడింది. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు ఇంతకాలం చెప్పుకుంటున్నదంతా అబద్ధాలే అని తనంతట తానుగానే అంగీకరించినట్లయ్యింది. ఇక్కడ ప్రశ్నించటం అంటే తాను ప్రశ్నించాలే కానీ తనను మాత్రం ఎవరు ప్రశ్నించకూడదని పవన్ డైరెక్టుగానే చెప్పేశారు. తాజాగా జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ వైఖరి బయటపడింది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఎవరైనా నోరుజారితే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరు ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. తాను తీసుకునే నిర్ణయాలు ఎవరికైనా ఇష్టంలేక వాళ్ళు ఇప్పుడే పార్టీలో నుండి వెళ్ళిపోవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. పార్టీలోనే ఉంటూ తన నిర్ణయాలను ప్రశ్నిస్తున్నవాళ్ళని వైసీపీ కోవర్టులుగా తేల్చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కోట్లాది మంది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటానన్నారు.
తన ఆలోచనలను, భావజాలాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబునాయుడే అర్థం చేసుకున్నప్పుడు పార్టీలోని కొందరు నేతలు ఎందుకు అర్థంచేసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పొత్తును పార్టీలోని ఏ స్థాయి నేతలు ప్రశ్నించినా, వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదని స్పష్టంగా చెప్పేశారు. తన నిర్ణయాలు నచ్చనివాళ్ళు ఇప్పుడే పార్టీని వదిలేసి వైసీపీలో చేరిపోవచ్చని కూడా చెప్పారు.
పవన్ తాజా మాటలు, హెచ్చరికలు చూసిన తర్వాత ప్రశ్నించటానికే పార్టీని పెట్టానని ఇంతకాలం పవన్ చెప్పిందంతా అబద్ధాలే అని అర్థమైపోయింది. పార్టీలో నేతల ప్రశ్నలనే తట్టుకోలేని పవన్ ఇక వైసీపీని ఏమి తట్టుకుంటారు? జనాలకు ఏమి సమాధానం చెబుతారు? ప్రశ్నించటం అంటే తాను మాత్రమే ప్రశ్నించాలని, తనను ఎవరు ప్రశ్నించకూడదని అనుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. నిజానికి ప్రశ్నించటం అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించటానికి మాత్రమే పవన్ పార్టీ పెట్టారు. ఎలాగంటే ప్రతిపక్షంలో ఉన్నా జగన్నే ప్రశ్నించారు, అధికారంలోకి వచ్చినా జగన్నే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పవన్ చివరకు తన ముసుగును తీసేశారన్నది వాస్తవం.