టెన్త్ రిజల్ట్స్.. పవన్ మార్కులెన్ని..? సోషల్ మీడియాలో రచ్చ
తనకు ఇంగ్లిష్ రాదని, లెక్కల్లో వీక్ అని, ఇంటర్ లో సీఈసీ చదివానని, ఎంఈసీ తీసుకోవాలనుకున్నానని, ఇంటర్ లెక్కల ట్యూషన్ చేరానని.. ఇలా రకరకాలుగా పవన్ తన చదువుగురించి చెప్పేవారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరీక్ష ఫలితాల సీజన్ నడుస్తోంది. ఏపీలో ఇటీవలే టెన్త్ ఫలితాలు కూడా వచ్చాయి. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ మార్కులెన్ని అనే చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి పవన్ కీ, ఇప్పుడొచ్చిన టెన్త్ రిజల్ట్ కి సంబంధం లేకపోయినా.. ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ పాస్ అని ప్రస్తావించడంతో ఈ రచ్చ మొదలైంది.
పవన్ కల్యాణ్ చదువు గురించి ఎప్పుడు ఎక్కడ చర్చ జరిగినా.. దానికి సరైన సమాధానం దొరకదు. తనకు తానే పవన్ కూడా చాలా సార్లు టెన్త్, ఇంటర్, కంప్యూటర్స్ డిప్లొమా అంటూ రకరకాలుగా చెప్పారు. దీంతో ఆయనపై తీవ్ర ట్రోలింగ్ నడిచింది. చదువు గురించి ఎప్పుడు పవన్ కల్యాణ్ చెప్పినా ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది. ఇప్పుడు నామినేషన్ సందర్భంగా అది మరింత పీక్స్ కి వెళ్లిపోయింది.
ఇంతకీ పవన్ ఏం చదివారు..?
తనకు ఇంగ్లిష్ రాదని, లెక్కల్లో వీక్ అని, ఇంటర్ లో సీఈసీ చదివానని, ఎంఈసీ తీసుకోవాలనుకున్నానని, ఇంటర్ లెక్కల ట్యూషన్ చేరానని.. ఇలా రకరకాలుగా పవన్ తన చదువుగురించి చెప్పారు. కానీ ఫైనల్ గా ఆయన చదువు పదో తరగతితోనే ఆగిపోయిందని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల్లో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్ తాను నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 1984లో పదోతరగతి పూర్తి చేసినట్లు తెలిపారు. అఫిడవిట్ లో స్పష్టం చేశారంటే ఇదే ఆయన అసలు విద్యార్హత అనుకోవాలి. అంటే మిగతా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అనుకోవాలి. మొత్తమ్మీద పవన్ అఫిడవిట్ తో ఆయన విద్యార్హత విషంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.