టార్గెట్ పిన్నెల్లి.. పల్నాడు పోలీసుల పక్షపాతం

పిన్నెల్లి మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈరోజు తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

Advertisement
Update:2024-05-28 08:30 IST

ఈవీఎం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్-5 వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం టీడీపీకి నచ్చలేదు, పల్నాడు పోలీసుల సహకారంతో పాత కేసుల్ని తవ్వితీయించింది. కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మరో మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. దీంతో పిన్నెల్లి బెయిల్ కోసం అనుబంధ పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది. 

పిన్నెల్లి మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈరోజు తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో పల్నాడు పోలీసులు అత్యుత్సాహం చూపించారని అంటున్నారు వైసీపీ నేతలు. బదిలీపై వచ్చిన బలగాలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయని అంటున్నారు. ఎప్పుడో నమోదయిన కేసుల్లో ఇప్పుడు పిన్నెల్లిని నిందితుడిగా చేర్చడమేంటనే ప్రశ్న వినపడుతోంది. న్యాయమూర్తులు కూడా ఇదే ప్రశ్న వేయడంతో సమాధానం చెప్పేందుకు పల్నాడు పోలీసులు తడపడ్డారు.

కౌంటింగ్ ప్రక్రియ రోజున పిన్నెల్లిని బయటకు రాకుండా చేసేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బదిలీపై వచ్చిన పోలీసులు కూడా వారికి సహకరించారని, అందుకే పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎల్లో మీడియా కూడా పిన్నెల్లిని టార్గెట్ చేస్తూ వరుస కథనాలిస్తోంది. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డికి వెసులుబాటు ఇచ్చినా, వారి విషయంలో ఉదారంగా ఉన్న పోలీసులు, కేవలం చింతమనేనిని టార్గెట్ చేసి పాత కేసులతో కొత్త వాదనలు తెరపైకి తెచ్చారని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News