నీ చెల్లి కూడా నీ నిర్ణయాన్ని ఛీకొట్టింది జగన్‌

యూనివర్శిటీకి గవర్నర్ ఛాన్సలర్‌గా ఉంటారని.. అలాంటిది ఈ పేరు మార్పు విషయం గవర్నర్‌కు కూడా జగన్ చెప్పలేదన్నారు. మీకు సమాచారం ఇచ్చారా అని అడగ్గా లేదని చెప్పారని.. ఈ పరిణామంపై ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.

Advertisement
Update:2022-09-22 15:39 IST

హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గవర్నర్‌ను కలిసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పంపే బిల్లును తిరస్కరించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్‌ కుమార్తె అయిన షర్మిల కూడా తన తండ్రి పేరు పెట్టినప్పటికీ వర్శిటీ పేరు మార్చడం సరైనది కాదని ఖండించారని గుర్తుచేశారు. రక్తం పంచుకొని పుట్టిన వారు కూడా జగన్‌ నిర్ణయాలను ఛీకొడుతున్నారని విమర్శించారు.

రాత్రికి రాత్రి ఆన్‌లైన్‌లో ఫైల్ పంపి సంతకాలు తీసుకుని మరుసటి రోజు బిల్లు తెచ్చారని, ఇదో చీకటి చట్టం అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపు గురించి రాత్రంతా ఆలోచించానని జగన్‌ చెబుతున్నారని.. ఆత్మలతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

యూనివర్శిటీకి గవర్నర్ ఛాన్సలర్‌గా ఉంటారని.. అలాంటిది ఈ పేరు మార్పు విషయం గవర్నర్‌కు కూడా జగన్ చెప్పలేదన్నారు. మీకు సమాచారం ఇచ్చారా అని అడగ్గా లేదని చెప్పారని.. ఈ పరిణామంపై ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ తాను సీఎంగా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును హైదరాబాద్‌లో స్డేడియానికి పెట్టామని, వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి పేర్లతో పార్కు ఏర్పాటు చేశామన్నారు. చెన్నారెడ్డి పేరుతో మెమోరియల్‌ నిర్మించామన్నారు. నేతలను గౌరవించే విధానం అది అన్నారు. జగన్‌ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగానే కాదు, రాజకీయాల్లో కూడా ఉండేందుకు అనర్హుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నిజాలతో పనిలేకుండా అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు చెబుతున్న జగన్‌ లాంటి సీఎంను ఇంతవరకు తాను చూడలేదన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మిస్తే దానికి నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. తండ్రి పేరు పెట్టుకోవాలనుకుంటే ఒక యూనివర్శిటీ కట్టుకుని పెట్టుకుంటే తాము మాట్లాడబోమన్నారు. బిల్లును తిరస్కరించాల్సిందిగా గవర్నర్‌ను కోరామని చంద్రబాబు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News