జగన్ ‘నాడు-నేడు’ సక్సెస్ అయినట్లేనా?
ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లల్లో పది మందిని ప్రభుత్వం అమెరికాకు పంపుతోంది. అమెరికాలో జరిగే ఐక్యరాజ్యసమితి సదస్సులో మన పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళ స్థితి గతులను మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు-నేడు కార్యక్రమంలోలో భాగంగా వేలాది స్కూళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. సుమారు 50 వేల స్కూళ్ళలో ఇప్పటికి 35 వేల స్కూళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యాయి. మిగిలిన స్కూళ్ళు కూడా దశలవారీగా రెడీ అవుతున్నాయి. ఇందులో స్కూళ్ళని బాగుచేయటమే కాకుండా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించటం కూడా భాగమే.
ఇందుకోసం ఇంగ్లీషు మీడియం ప్రారంభించటం, స్పోకెన్ ఇంగ్లీషు, ఇంగ్లీషు స్కిల్స్ లాంటి వాటిల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. దీనికి అదనంగా సిలబస్ మొత్తాన్ని బైజూస్‌తో టై అప్ చేసుకుని అత్యున్నత టెక్నాలజీతో టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరగటతో పాటు అత్యుత్తమ ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ విద్యార్థులకు మించిన మార్కులను ప్రభుత్వ విద్యార్థులు సాధిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లల్లో పది మందిని ప్రభుత్వం అమెరికాకు పంపుతోంది. అమెరికాలో జరిగే ఐక్యరాజ్యసమితి సదస్సులో మన పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఐక్య రాజ్యసమితి సదస్సులో అంతర్జాతీయ విద్యా విధానంపై ప్రజెంటేషన్ ఉండబోతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని మనబడి నాడు-నేడు కాన్సెప్టుపై ప్రత్యేక స్టాళ్ళను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆ స్టాల్స్ లో మన పిల్లలు కాన్సెప్టుపై ఫ్లకార్డులు పట్టుకోవటమే కాకుండా స్టాళ్ళకు వచ్చే విదేశీ ప్రతినిధులకు వివరించబోతున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న కాన్సెప్టుపై సమితి వేదిక మీద మాట్లాడబోతున్నారు. అంటే ఏపీలో అమలవుతున్న విద్యావిధానాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకోబోతున్నాయి. అది కూడా చదువుకుంటున్న విద్యార్థుల ద్వారానే కావటం జగన్ కాన్సెప్టు సక్సెస్ అయ్యిందనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అల్లూరి సీతా రామరాజు జిల్లా, కర్నూలు, నూజివీడు, ఏలూరు జిల్లా, విజయనగరం జిల్లాల్లో చదువుతున్న 9, 10 తరగతుల పిల్లలు ఎంపికయ్యారు. వీళ్ళందరినీ అమెరికాకు తీసుకెళ్ళేందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ చేస్తోంది. 9,10 తరగతుల పిల్లలు తమ విద్యావిధానంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఐక్య రాజ్య సమితి వేదికపై మాట్లాడటం కన్నా గర్వకారణం ఏముంటంది?
♦