మోత మోగిద్దాం.. ఇదేం కామెడీ లోకేశ్‌!

స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు నారా లోకేశ్‌. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement
Update:2023-09-29 17:16 IST

ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు అనేక మార్గాలు అనుసరిస్తుంటాయి. ధర్నాలు, సమ్మెలు, బంద్‌, ముట్ట‌డి లాంటివి చేప‌డుతాయి. ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో చాలా సహజం. అయితే కొన్ని సందర్భాల్లో నాయకులు తీసుకునే నిర్ణయాలు నవ్వులపాలవుతాయి. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇచ్చిన పిలుపు కూడా హస్యాస్పదంగా ఉంది.


స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు నారా లోకేశ్‌. ఈ మేరకు ట్వీట్ చేశారు. లోకేశ్‌ ఏమన్నారంటే.. ``అక్రమ అరెస్టులు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడికి మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య ఉన్న చోటే మోత మోగించిన ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా శబ్ధం వినిపిద్దాం అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇప్పుడు నారా లోకేశ్‌ ఇచ్చిన పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం ప్రస్తుతం కోర్టుల్లో ఉందని.. ఆయన తప్పు చేశారా, లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయంటూ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. నిజంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని ప్రజలు భావిస్తే ఇప్పటికే రోడ్లపైకి వచ్చేవారని, మీరు ఇలా మద్దతు ఇవ్వాలని అడుక్కునే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతోనే.. లోకేశ్‌ మోత మోగిద్దాం అంటూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇక ఇన్నర్ రింగ్ రోడ్‌ కేసులో నిన్ను కూడా అరెస్టు చేస్తారు.. రెడీగా ఉన్నావా అంటూ లోకేశ్‌కు మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో దాక్కుంటావు.. దమ్ముంటే ఏపీకి వచ్చి విచారణను ఎదుర్కొవాలంటూ సవాల్ విసురుతున్నారు.

Tags:    
Advertisement

Similar News