తగ్గేదే లే.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఈ గౌరవం దక్కింది.
తెలుగు సినీ హీరోలెవ్వరికీ దక్కని అరుదైన అదృష్టం అల్లు అర్జున్ ని వరించింది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. ఆ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర పుటల కెక్కుతున్నారు. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఈ గౌరవం దక్కింది.
ఉత్తమ నటిగా ఆలియా భట్ (గంగూభాయి కఠియావాడి), కృతి సనన్(మిమి) ఇద్దరూ ఎంపిక కావడం విశేషం. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్ కి, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కి అవార్డులు ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాకెట్రీ - ది నంబీ ఎఫెక్ట్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ ఎంపికయ్యారు. ఆయన మరాఠీలో గోదావరి అనే సినిమా తీశారు.
ఆర్ఆర్ఆర్ కి అవార్డుల పంట..
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రావడం మరో విశేషం. ఆస్కార్ తో ప్రపంచ గుర్తింపు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను.. బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా కింగ్ సాల్మన్, బెస్ట్ కొరియోగ్రఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఎంఎం కీరవాణి, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా కాలభైరవ ఎంపికయ్యారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ సినిమాగా కూడా ఆర్‌ఆర్‌ఆర్ జాతీయ అవార్డులకు ఎంపికైంది. ఉత్తమ గేయ రచయితగా కొండపొలం చిత్రానికి గాను చంద్రబోస్, ఉత్తమ సంగీత దర్శకుడిగా పుష్ప సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారు.