ఏమ్మా భారతీ రెడ్డి గారూ..! లోకేష్ ట్వీట్ వైరల్

పోనీ బూదాటి మోసగాడే అనుకుందాం, ఆయనకు లోకేష్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయనుకుందాం. మరి అలాంటి వ్యక్తికి 2021 సెప్టెంబర్ లో టీటీడీ బోర్డ్ మెంబర్ గా పదవి ఎలా లభించిందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement
Update: 2023-11-29 06:38 GMT

ఈనాడులో వచ్చే వార్తలన్నిటికీ కౌంటర్లివ్వడం సాక్షికి పరిపాటిగా మారింది. అయితే అలవాటులో పొరపాటుగా సాక్షి కూడా అలాంటి కొన్ని వార్తలిస్తుంటుంది. ఆ విషయం ఎవరికీ తెలియదనుకోవడంతోనే ఇక్కడ చిక్కొచ్చిపడింది. సాక్షి సెల్ఫ్ గోల్ వేసుకుంది. దీనిపై నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏమ్మా భారతీ రెడ్డి గారూ..! తప్పుడు సాక్షి పత్రికకు సిగ్గు అనేది లేదా? అంటూ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ తోపాటు సాక్షిలో వచ్చిన కథనాన్ని కూడా జతచేశారు.


అసలేం జరిగింది..?

బూదాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతుంటాడు. సాహితీ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి విల్లాలు నిర్మించి ఇస్తానని మాయమాటలు చెప్పి చాలామందికి శఠగోపం పెట్టాడు. చాన్నాళ్లుగా అతడిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో బాధితుడు పోలీస్ కేసు పెట్టడంతో బూదాటి లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. అయితే అతడి స్వస్థలం మంగళగిరి. మంగళగిరి అంటే నారా లోకేష్ కి కూడా సంబంధం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనపై వార్త రాస్తూ చివర్లో లోకేష్ పేరు కూడా తన కథనంలో జతచేర్చింది సాక్షి. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు అతను భారీగా డబ్బులిచ్చారని, నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేసే సమయంలో కూడా చందాలిచ్చారని సాక్షిలో రాసుకొచ్చారు. ఈ వ్యవహారంపై లోకేష్ మండిపడ్డారు.

సాక్షి సెల్ఫ్ గోల్ ఇలా..

పోనీ బూదాటి మోసగాడే అనుకుందాం, ఆయనకు లోకేష్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయనుకుందాం. మరి అలాంటి వ్యక్తికి 2021 సెప్టెంబర్ లో టీటీడీ బోర్డ్ మెంబర్ గా పదవి ఎలా లభించిందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డ్ మెంబర్ అయ్యారంటే, కీలక నేతల్ని ఏ స్థాయిలో సంతృప్తి పరచి ఉంటారో ఊహించవచ్చు. మోసగాడికి టీటీడీ పదవి ఇచ్చిన వైసీపీ వ్యవహారాన్ని ఇక్కడ సాక్షి వదిలేసింది. అతడు లోకేష్ సన్నిహితుడంటూ కథనం ఇచ్చింది. దీంతో లోకేష్ కి ఛాన్స్ దొరికినట్టయింది. నా సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? బాగుంది.. అంటూ ట్వీట్ వేసి పరువు తీశారు. 


Tags:    
Advertisement

Similar News