బెయిల్ తీర్పు లోకేష్ కి అలా అర్థం అయిందేంటి..?

చంద్రబాబుకి కోర్టు ఇచ్చింది జస్ట్ బెయిల్ మాత్రమే, నిర్దోషి అనే క్లీన్ చిట్ ఎంతమాత్రం కాదు. ఆ మాత్రానికే లోకేష్ సత్యం, అసత్యం, యుద్ధం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు.

Advertisement
Update:2023-11-20 17:41 IST

చంద్రబాబుకి మొన్న మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఆ బెయిల్ తోనే టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి.

ఇప్పుడు వచ్చింది రెగ్యులర్ బెయిల్. ఈ బెయిల్ తో సత్యం గెలిచింది అని స్టేట్ మెంట్ ఇచ్చారు నారా లోకేష్.

అసలు చంద్రబాబుకి వచ్చింది బెయిల్ అనుకుంటున్నారా లేక, నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చిందని అనుకుంటున్నారా..?

టీడీపీ నేతలు, నారా లోకేష్ తీరు చూస్తుంటే చంద్రబాబు స్కిల్ స్కామ్ నుంచి బయటపడినట్టే అనుకోవాలి. ఆ రేంజ్ లో ఉన్నాయి ఎలివేషన్లు. ఇన్నాళ్లూ వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, అన్యాయంగా జైలులో పెట్టారంటూ ఆక్రోశించిన తెలుగు తమ్ముళ్లు.. మరి వైసీపీ మేనేజ్ మెంట్ ఫెయిలైందని అంటారా..? లేక ఇప్పుడు టీడీపీ మేనేజ్మెంట్ మొదలైందని అంటారా..? నారా లోకేష్ ప్రకటన మాత్రం కాస్త కామెడీగా ఉంది.

స‌త్యం గెలిచింది..అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంద‌ని పేర్కొన్నారు లోకేష్. "కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్త‌వ‌మ‌ని న్యాయ‌స్థానమే తేల్చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్ర‌బాబు 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో పన్నిన ప‌న్నాగం ఇదని దేశ‌మంత‌టికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో క‌డిగిన ముత్యంలా చంద్రబాబు ఈ కుట్ర‌కేసుల‌న్నింటినీ జ‌యిస్తారు. స‌త్యం గెలిచింది. జ‌గ‌న్ అనే అస‌త్యంపై యుద్ధం ఆరంభం అవుతుంది." అంటూ లోకేష్ విడుదల చేసిన ప్రకటన టీడీపీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తుందేమో కానీ, కోర్టు తీర్పుని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.

చంద్రబాబుకి కోర్టు ఇచ్చింది జస్ట్ బెయిల్ మాత్రమే, నిర్దోషి అనే క్లీన్ చిట్ ఎంతమాత్రం కాదు. ఆ మాత్రానికే లోకేష్ సత్యం, అసత్యం, యుద్ధం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. మొత్తమ్మీద ఈ బెయిల్ తీర్పుతో చంద్రబాబుకి మాత్రం కాస్త ఊరట లభిస్తుందనే చెప్పాలి. స్కిల్ కేసు కాకపోతే మిగతా కేసులున్నాయి కదా అని వైసీపీ నేతలు ఆల్రడీ వెటకారం స్టార్ట్ చేశారు. ఎన్నికల లోపు ఏపీలో రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News