చంద్రబాబు ఆస్తులు రూ.931 కోట్లు.. 24 క్రిమినల్ కేసులు

ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరిటే రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో చరాస్తుల విలువ రూ.810 కోట్లుగా ఉంది.

Advertisement
Update:2024-04-20 09:20 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆస్తులు గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 40 శాతం పెరిగాయి. తనకు, తన భార్య నారా భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో స్వయంగా ప్రకటించారు. శుక్రవారం చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు భువనేశ్వరి. చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి.


ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరిటే రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో చరాస్తుల విలువ రూ.810 కోట్లుగా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్‌లోని షేర్ల విలువ దాదాపు రూ.763 కోట్లు. ఇక రూ. కోటి 40 లక్షల విలువైన బంగారం ఇతర అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు తన పేరిట కేవలం రూ.36 కోట్ల 36 లక్షల ఆస్తిని మాత్రమే చూపించారు. కుమారుడు లోకేష్‌తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 కోట్ల 48 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్‌, మెగాబిడ్‌ ఫైనాన్స్‌ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్‌ ఫిన్‌లిస్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక చంద్రబాబుపై కీలకమైన అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్‌, ఫైబర్ నెట్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు మొత్తం 24 క్రిమినల్ కేసులున్నాయి.

Tags:    
Advertisement

Similar News