ట్విట్టర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. ఆ ట్వీటే కారణం!

సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే ఈనెల 11న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే 13న నాగబాబు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

Advertisement
Update:2024-05-16 22:02 IST

ట్విట్టర్‌ నుంచి వైదొలిగారు జనసేన నేత, మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు. తన వ్యక్తిగత అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేసుకున్నారు. ట్విట్టర్‌ నుంచి నాగబాబు వైదొలగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ట్విట్టర్‌ డీయాక్టివేట్‌ చేసుకోవడానికి ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్‌తో తలెత్తిన వివాదమే కారణంగా తెలుస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.?

సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే ఈనెల 11న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే 13న నాగబాబు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని మీడియాలో, సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. శిల్పా రవిచంద్రారెడ్డి తనకు దగ్గరి మిత్రుడు కావడం వల్లే వెళ్లానని.. తన స్నేహితులు ఎక్కడ ఉన్నా వారి మేలు కోరుకుంటానంటూ అల్లు అర్జున్ తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. కానీ నాగబాబు మాత్రం తన ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.



నాగబాబు ట్వీట్‌ మెగా, అల్లు ఫ్యాన్స్‌ మధ్య వివాదానికి దారి తీసింది. గత ఐదారు రోజులుగా సోషల్‌మీడియా పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య ట్రోలింగ్స్‌, విమర్శలు నడుస్తున్నాయి. ఈ వివాదం కాస్త మెగాస్టార్‌ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన నాగబాబుపై ఆగ్రహం వ్యక్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వివరణ ఇచ్చుకోలేక నాగబాబు ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News