కండువా కప్పుకున్నాక కూడా ముద్రగడ మౌనం..

వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపినట్టు సాక్షిలో వార్తలొచ్చాయి కానీ, ఆయన నేరుగా మీడియాతో మాట్లాడలేదు.

Advertisement
Update:2024-03-15 14:45 IST

ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ల కంటే లేఖలే ఎక్కువ ఫేమస్. ఆయన నేరుగా మీడియాతో మాట్లాడటం కంటే బహిరంగ లేఖల ద్వారా తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తుంటారు. వైసీపీలో చేరిక విషయాన్ని, ర్యాలీ రద్దు చేసుకున్న విషయాన్ని కూడా ఆయన బహిరంగ లేఖల ద్వారానే తెలియజేశారు. ఇప్పుడు అధికారికంగా ఆయన వైసీపీలో చేరారు, సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తనతోపాటు తన కొడుకు గిరిని కూడా వైసీపీలో చేర్చారు. అయితే చేరిక తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సహజంగా వైసీపీలో చేరిన తర్వాత, పార్టీ కార్యాలయం బయట మీడియాతో ఉత్సాహంగా మాట్లాడి వెళ్లిపోతుంటారు నేతలు. కానీ ముద్రగడ మాత్రం సైలెంట్ గా నిష్క్రమించారు. తర్వాత వివరంగా ప్రెస్ మీట్ పెడతారేమో చూడాలి.


వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపినట్టు సాక్షిలో వార్తలొచ్చాయి కానీ, ఆయన నేరుగా మీడియాతో మాట్లాడలేదు. వైసీపీకి కూడా ఇది ఊహించని పరిణామమే. పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు, పవన్ ని ఆయన చెడామడా తిడతారని కొంతమంది ఊహించారు. కాపులకు చిన్న సందేశమిస్తారని కూడా అనుకున్నారు. కానీ ఆయన కేవలం చేరికకు మాత్రమే పరిమితమయ్యారు. మరి భవిష్యత్ లో ముద్రగడ నుంచి వైసీపీ ఏమేం ఆశించొచ్చు అనేది తేలాల్సి ఉంది.

పిఠాపురం సంగతేంటి..?

ఓ దశలో పవన్ పిఠాపురంకి వస్తే, అక్కడ ఇప్పటికే ప్రకటించిన ఎంపీ వంగా గీత స్థానంలో ముద్రగడను వైసీపీ పోటీకి దింపుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. పవన్ నిజంగానే నిన్న పిఠాపురంలో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు, మరి ఈరోజు వైసీపీలో చేరిన ముద్రగడకు పిఠాపురం కన్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది తేల్చి చెప్పలేదు పార్టీ. ప్రస్తుతానికి అక్కడ వంగా గీత, పవన్ కు ప్రధాన పోటీదారు అనుకోవాలి. ఇక టీడీపీ వర్మ నిజంగానే ఇండిపెండెంట్ గా బరిలో దిగితే అప్పుడు పవన్ పరిస్థితి ఏంటో చూడాలి. ఈరోజు వైసీపీలో చేరిన ముద్రగడకు మాత్రం పిఠాపురం టికెట్ ఇవ్వట్లేదనే విషయం తేలిపోయింది. ఆయన రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరపున ప్రచారం చేస్తారా, లేఖ కాపు వర్గానికి ఓ లేఖ రాసి సరిపెట్టుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News