రాష్ట్ర అప్పులు పెరిగింది చంద్రబాబు హయాంలోనే - విజయసాయిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. టీడీపీ హయాంలో ఉన్న అప్పులకు వైసీపీ హయాంలో ఉన్న అప్పులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని విజయసాయిరెడ్డి కోరారు.

Advertisement
Update:2023-12-20 15:02 IST
రాష్ట్ర అప్పులు పెరిగింది చంద్రబాబు హయాంలోనే - విజయసాయిరెడ్డి
  • whatsapp icon

తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సభ్యులు చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని కాంగ్రెస్ శ్వేత పత్రం విడుదల చేయగా, అప్పులు కాదు.. అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది.

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఏపీలో అప్పులపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అప్పు భారీగా పెరిగిందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. టీడీపీ హయాంలో ఉన్న అప్పులకు వైసీపీ హయాంలో ఉన్న అప్పులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని విజయసాయిరెడ్డి కోరారు.

కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని విమర్శించారు. పేద ప్రజలను ఆదుకునేలా సీఎం జగన్ ఖర్చులు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా అని విజయసాయిరెడ్డి వివరించారు.

Tags:    
Advertisement

Similar News