నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు
తిరుమలపైనా అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు వేయి కాళ్ల మండపాన్ని తొలగిస్తే విమర్శించారని.. కానీ ఆ రోజు శాస్త్రం ప్రకారమే ఆ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించిందన్నారు.
ఏపీ ప్రభుత్వంపై నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలపైనా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాల్‌గా మారిందన్నారు. సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందన్నారు. టికెట్ల ధరలను పెంచాలని ఒకసారి, తగ్గించాలని ఒకసారి కోరడంతో గందరగోళం ఏర్పడి ప్రజల్లో విరక్తి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడం కూడా ఈ పరిస్థితి ఒక కారణమని వ్యాఖ్యానించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్‌పై దత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. హీరోలకు అధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్న దాంట్లో వాస్తవం లేదని, మార్కెట్‌కు అనుగుణంగానే హీరోలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తిరుమలపైనా అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు వేయి కాళ్ల మండపాన్ని తొలగిస్తే విమర్శించారని.. కానీ ఆ రోజు శాస్త్రం ప్రకారమే ఆ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించిందన్నారు. కానీ ఈ మూడేళ్లలో తిరుమలలో జరగని పాపమంటూ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అయినా వేంకటేశ్వరస్వామి ఇంకా ఎందుకు చూస్తూ ఊరుకున్నారో అర్థం కావడం లేదన్నారు అశ్వనీదత్.