రాజుగారిలాగ కాలక్షేపం చేయాల్సిందేనా?

ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలన్నీ ఇక నుండి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగానే జరుగుతాయి. మరి ఎమ్మెల్యే హోదాలో ఆనం ఏమిచేయాలి? చేసేదేమీ లేదు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే రేపటి నుండి జగన్‌ను టార్గెట్ చేసుకుంటూ మీడియా సమావేశాలు పెట్టుకోవాలంతే.

Advertisement
Update:2023-01-04 11:28 IST

రాజుగారిలాగ కాలక్షేపం చేయాల్సిందేనా?

అధికార పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజులాగ కాలక్షేపం చేయాల్సిందే. పోయిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే జగన్మోహన్ రెడ్డితో రఘురామకు చెడింది. అప్పటి నుండి పార్టీతో గ్యాప్ వచ్చేసింది. తర్వాత్తర్వాత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా ఫోల్డులోకి వెళిపోయి డైరెక్టుగా జగన్ మీదే ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయించుకునేందుకు ఎంపీ చాలా ప్రయత్నాలు చేశారు.

ఇదే సమయంలో ఎంపీపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. దాంతో సస్సెన్షన్, అనర్హత వేటు విషయంలో ఇద్దరి కోరికా తీరలేదు. అప్పటి నుండి ఢిల్లీలోనే రచ్చబండ పేరుతో ఎంపీ ప్రతిరోజు మీడియా సమావేశంలో జగన్‌ను టార్గెట్ చేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు. రాష్ట్రంలోకి వస్తే ఏమిజరుగుతుందో అన్న భయంతో ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఎంపీని పార్టీ అసలు పట్టించుకోవటమే లేదు.

ఇప్పుడు ఆనం పరిస్ధితి కూడా అలాగే అయిపోవటం ఖాయం. ఎందుకంటే వెంకటగిరి ఇన్‌చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించేశారు. అంటే ప్రభుత్వం+పార్టీ వ్యవహారాలన్నీ ఇక నుండి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగానే జరుగుతుంది. మరి ఎమ్మెల్యే హోదాలో ఆనం ఏమిచేయాలి? చేసేదేమీ లేదు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే రేపటి నుండి జగన్‌ను టార్గెట్ చేసుకుంటూ మీడియా సమావేశాలు పెట్టుకోవాలంతే.

అయితే ఇక్కడ ఆనంకు ఒక సమస్య ఉంది. అదేమిటంటే ఎంపీ అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుని జగన్‌ను టార్గెట్ చేస్తున్నా చెల్లిపోతోంది. రాష్ట్రంలోకి వస్తే తనపై దాడిచేసి కొడతారనే భయంవల్లే ఇక్కడకు రావటంలేదు. మరి ఆనం విషయంలో అలా సాధ్యంకాదు. ఎందుకంటే ఆనం ఉండేది వెంకటగిరిలోనే. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, ఆరోపణలు చేస్తున్నా పార్టీ క్యాడర్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఇంతవరకు జగన్‌ను డైరెక్టుగా ఆనం ఏమీ అనలేదుకాబట్టి. అదే ఆనం కూడా జగన్‌ను ఏమన్నా అంటే అప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News