రేణూదేశాయ్ పేరుతో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

ఇది కొత్తగా కుదిరిన పొత్తు కాదని, సన్నాసీ, సన్నాసీ రాసుకుంటే రాలేది బూడిదేనన్నారు రోజా. టీడీపీ, జనసేన కలిసినా.. బీజేపీ మాత్రం ఆ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

Advertisement
Update:2023-09-15 12:22 IST

"మీతో కాపురం చేస్తూ మీ భర్త ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది..? మీరయితే ఆ సంబంధాన్ని ఒప్పుకుంటారా..?" అంటూ ఆమధ్య పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ చేసిన వ్యాఖ్యలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పారు మంత్రి రోజా. బీజేపీతో పొత్తులో ఉంటూ, వారితో చర్చించకుండానే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ అన్నారని, ఇదెక్కడి పొత్తు ధర్మం అని ఆమె లాజిక్ తీశారు. బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందేమో అంటూ మాట్లాడుతున్నారని.. పవన్ కల్యాణ్ కి నిజంగానే తిక్క ఉందని, ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో ఆయన లెక్క కూడా బాగానే తేలిందని చెప్పారు రోజా.

ప్యాకేజీ కోసమే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు రోజా. పెద్ద ప్యాకేజీ రావడం వల్లే జైలుకి వెళ్లి మరీ ఆయన కాళ్ల దగ్గర జనసేనను పెట్టేసి వచ్చారని చెప్పారు. చంద్రబాబు పనైపోతే పవన్ ఆ స్థానానికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడనుకుంటే, ఇలా చేశాడేంటా..? అని జనసైనికులే అనుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుని సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ లో పవన్ వచ్చి సంఘీభావం తెలపడం అందరికీ తెలిసిన విషయమేనని ఇది కొత్తగా కుదిరిన పొత్తు కాదని, సన్నాసీ, సన్నాసీ రాసుకుంటే రాలేది బూడిదేనన్నారు రోజా. టీడీపీ, జనసేన కలిసినా.. బీజేపీ మాత్రం ఆ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

ఇప్పుడు ఆ మాటలు రావట్లేదే..?

ఆమధ్య నారా లోకేష్.. ఉచ్చపోయిస్తా, గుడ్డలూడదీస్తా అంటూ గంభీరంగా మాట్లాడారని, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ డైలాగులు, ఆ ఆగ్రహం ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు మంత్రి రోజా. లోకేష్ ఢిల్లీ వెళ్లినా, ఎవరిని కలిసినా తమకు నష్టమేమీ లేదన్నారు. 


Tags:    
Advertisement

Similar News