లబ్ధిదారుల కాళ్లు కడిగి చేతిలో పెన్షన్ పెట్టిన మంత్రి

పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ స్టాఫ్ తోపాటు ఆయన కూడా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులకు కాళ్లు కడిగి మరీ వారికి పెన్షన్లు అందించారు.

Advertisement
Update: 2024-07-01 05:26 GMT

ఏపీలో పెన్షన్ల పంపిణీ కోలాహలంగా సాగుతోంది. పేరుకి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తున్నా.. టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి అవ్వా తాతల్ని పలకరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో వారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొంటున్నారు, ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ల పంపిణీలో తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పాలకొల్లులో పెన్షన్ల పంపిణీ కోసం వెళ్లిన ఆయన లబ్ధిదారుల కాళ్లు కడిగి మరీ వారికి పెన్షన్ సొమ్ము అందజేశారు.


పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ స్టాఫ్ తోపాటు ఆయన కూడా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులకు కాళ్లు కడిగి మరీ వారికి పెన్షన్లు అందించారు. మీ మనవడిలాంటి వాడిని, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చింది అంటూ ఆయన వారికి చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన లబ్ధి ఇది అని వివరించారు మంత్రి నిమ్మల.

పెంచిన పెన్షన్ రూ.4వేలతోపాటు.. 3 నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7వేల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈరోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈరోజు కుదరకపోతే రేపు మధ్యాహ్నం లోపు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తారని తెలుస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. టీడీపీ నేతలంతా ఈరోజు పెన్షన్ల పంపిణీని పండగలా నిర్వహిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News