ఓటింగ్‌ పెరిగినా వైఎస్సార్‌ గెలిచారు.. జగనూ గెలుస్తాడు

వార్‌ వన్‌ సైడేనన్న అమర్నాథ్‌.. మరోసారి జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update:2024-05-16 12:41 IST

ఓటింగ్‌ పెరిగితే ప్రభుత్వం మారుతుందంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఓటింగ్‌ పెరిగినా తిరిగి అదే ప్రభుత్వాలు వచ్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయన్నారు. 2009లో టీడీపీ మహాకూటమి ఏర్పాటు చేసినప్పటికీ ఓటింగ్ పెరిగి.. మ‌హానేత వైఎస్సార్‌ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 2019 కంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి సీట్లు పెరుగుతాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వైసీపీకే పట్టం కట్టారన్నారు అమర్నాథ్‌. ప్రత్యేకంగా మహిళలు వైసీపీకి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అండగా నిలబడిందన్నారు.

వార్‌ వన్‌ సైడేనన్న అమర్నాథ్‌.. మరోసారి జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 0.5 పార్టీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదంటూ పరోక్షంగా జనసేనపై సెటైర్లు వేశారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నామన్నారు. షర్మిలకు డిపాజిట్ రావడం కూడా అనుమానమేనన్నారు.

Tags:    
Advertisement

Similar News