ప్రశాంత్‌ కిషోర్‌ ఓ క్యాష్‌ పార్టీ.. బొత్స సంచలనం

కన్సల్టెన్సీ సంస్థలు చాలా చెప్తాయని, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది తామేనన్నారు బొత్స. ఐ-ప్యాక్ చెప్పిన వాళ్లకే టికెట్లిచ్చారనే వాదనను ఆయన తోసిపుచ్చారు.

Advertisement
Update:2024-05-21 19:55 IST

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిషోర్‌పై ఘాటుగా స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్‌ పార్టీ అన్న బొత్స, ఎవరు డబ్బులిస్తే వాళ్ల వైపు పీకే మాట్లాడతారంటూ ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్ ఏమైనా బ్రహ్మదేవుడా అని ప్రశ్నించారు. 2019లో భ్రమల్లో ఉండి ఆయనను తెచ్చుకున్నామని, తర్వాత ఆయన కమర్షియల్ అని తెలిసిందన్నారు బొత్స.

జిమ్మిక్కులు, చిట్కాలు ఒక్కసారి మాత్రమే పనిచేస్తాయన్నారు బొత్స. జగన్‌కు కావాల్సింది జిమ్మిక్కులు కాదన్నారు. ప్రశాంత్‌ కిషోర్ అనే వాడు వన్ టైమ్‌ సెటిల్మెంట్‌ అని, రెండోసారి ప్రశాంత్ కిషోర్‌ను నమ్మడానికి లేదన్నారు. ఐ-ప్యాక్ సేవలను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నామని స్పష్టం చేశారు.

కన్సల్టెన్సీ సంస్థలు చాలా చెప్తాయని, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది తామేనన్నారు బొత్స. ఐ-ప్యాక్ చెప్పిన వాళ్లకే టికెట్లిచ్చారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఐ-ప్యాక్‌ ఇచ్చిన లిస్ట్‌లో నుంచి పార్టీ అభ్యర్థులను సెలక్ట్ చేసుకుందన్నారు. వైసీపీకి జగనే సుప్రీం అన్నారు బొత్స. వైసీపీ పార్టీ, నాయకులు, కార్యకర్తలు శాశ్వతమన్న ఆయన.. ప్ర‌శాంత్ కిషోర్ ఐనా, ఐ-ప్యాక్ ఐనా తాత్కాలికమేనన్నారు.

Tags:    
Advertisement

Similar News