నా అల్లుడి వెనకున్నది ఆయనే.. అంబటి షాకింగ్ కామెంట్స్
సాధారణంగా గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించే వాడిని కాదని.. కానీ పొన్నూరులో ప్రచారానికి వచ్చిన పవన్‌కల్యాణ్ అంబటి రాంబాబుకు సొంత అల్లుడే ఓటు వేయొద్దని అనడంతోనే స్పందించాల్సి వచ్చిందన్నారు.
తన రెండో అల్లుడు గౌతమ్ వీడియోపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. గౌతమ్ వెనుక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉన్నారని.. గౌతమ్‌ను రెచ్చగొట్టి తనకు వ్యతిరేకంగా వీడియో చేయించారని ఆరోపించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ పవన్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ నీచ రాజకీయాలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
తన రెండో కుమార్తె డాక్టర్ మనోజ్ఞ, అల్లుడు డాక్టర్ గౌతమ్‌ల మధ్య నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నాయన్నారు అంబటి. రెండేళ్లుగా మనోజ్ఞతో పాటు ఆమె కుమార్తె, కుమారుడు తన దగ్గరే ఉంటున్నారని, వారికి అల్లుడి నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. సాధారణంగా గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించే వాడిని కాదని.. కానీ పొన్నూరులో ప్రచారానికి వచ్చిన పవన్‌కల్యాణ్ అంబటి రాంబాబుకు సొంత అల్లుడే ఓటు వేయొద్దని అనడంతోనే స్పందించాల్సి వచ్చిందన్నారు.
అందరి కుటుంబాల్లో వివాదాలు, విబేధాలు ఉంటాయన్నారు అంబటి. గౌతమ్ తన కుమార్తె మనోజ్ఞను బెదిరించి విడాకులు ఇవ్వాలని కోరారన్నారు. కుమార్తెతో పాటు ఆమె ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం తాను ఫైట్ చేస్తున్నానని చెప్పారు అంబటి.
ఇంతకీ ఏం జరిగిందంటే..!
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుబంధ మీడియా మరింత లోతుల్లోకి దిగజారుతోంది. పలువురు వైసీపీ నేతల ఫ్యామిలీల్లో విబేధాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తోంది. మొన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె, అంతకుముందు బూడి ముత్యాల నాయుడు కుమారుడు, నిన్న అంబటి రాంబాబు అల్లుడితో వారికి వ్యతిరేకంగా మాట్లాడించి ఆ వీడియోలను వైరల్ చేస్తోంది. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు కొత్త కాదని.. నాడు ఎన్టీఆర్ కుటుంబంలో చీలిక నుంచి నేటి వరకు ఆయన చేస్తున్నది అదేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.