పొన్నవోలు ముందు లూథ్రా బలాదూర్.. మంత్రి అంబటి సెటైర్లు..!
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు శనివారం ఢిల్లీ నుంచి సిద్ధార్థ్ లూథ్రాను హుటాహుటిన పిలిపించారు తెలుగుదేశం నేతలు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చంద్రబాబు కోట్ల రూపాయలు పెట్టి లాయర్‌ను తెచ్చుకున్నా లాభం లేకపోయిందంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. రోజుకు కోటిన్నర రూపాయలు వసూలు చేసే లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు బలాదూర్ అంటూ సెటైర్ వేశారు. ఏం పీకారన్న బాబుకు దైవం బుద్ది చెప్పిందంటూ మరో ట్వీట్ చేశారు అంబటి.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు శనివారం ఢిల్లీ నుంచి సిద్ధార్థ్ లూథ్రాను హుటాహుటిన పిలిపించారు తెలుగుదేశం నేతలు. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు సిద్ధార్థ్ లూథ్రా రోజుకు కోటిన్నర వసూలు చేస్తారని సమాచారం. ఇక స్పెషల్ ఫ్లైట్, లగ్జరీ హోటల్ లాంటి ఖర్చులు ఫీజుకు అదనమని తెలుస్తోంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టుల్లో అనేక కేసుల్లో లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కోటిన్నర పెట్టి సిద్ధార్థ్ లూథ్రాను తెచ్చిన ప్రయోజనం లేదంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు మారుమోగుతోంది. 2019 జూన్‌లో పొన్నవోలును అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించింది జగన్ ప్రభుత్వం. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం పొన్నవోలుది.