అదే ఆప్యాయత, అదే చిరునవ్వు..
అప్పుడైనా, ఇప్పుడైనా ప్రజలతో మమేకం అవడం, వారిని తనవారిగా భావించి దగ్గరకు తీసుకోవడం ఒక్క జగన్ కే సాధ్యమవుతుందని అంటున్నారు నెటిజన్లు.
మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర.. అడుగడుగునా నాటి ప్రజా సంకల్ప యాత్రను గుర్తుకు తెస్తోంది. అప్పుడు పాదయాత్ర చేసిన జగన్, ఇప్పుడు సెక్యూరిటీ కారణాల వల్ల బస్సు యాత్ర చేస్తున్నారు, అంతే తేడా. ఆయన పలకరింపులో అదే ఆప్యాయత, అదే అభిమానం ఇప్పుడూ కూడా కనపడుతున్నాయని అంటున్నారు ప్రజలు. పేదలు, సామాన్యులు, కూలీలు, రోగులు.. ఎవరైనా సరే తన వద్దకు వస్తానంటే కచ్చితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు సీఎం జగన్. బస్సు ఆపి మరీ అందర్నీ పలకరిస్తూ వెళ్తున్నారు.
జగన్ బస్సు యాత్ర నేడు ఐదో రోజుకి చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధమా..? అంటూ ఈరోజు ఉదయం ట్వీట్ వేశారు సీఎం జగన్. అనంతరం తన స్టార్ క్యాంపెయినర్లు వీరేనంటూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు, తన దగ్గరకు వచ్చేవారి పట్ల జగన్ ఆప్యాయత చూస్తే కచ్చితంగా ప్రజా సంకల్ప యాత్ర గుర్తొస్తుంది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రజలతో మమేకం అవడం, వారిని తనవారిగా భావించి దగ్గరకు తీసుకోవడం ఒక్క జగన్ కే సాధ్యమవుతుందని అంటున్నారు నెటిజన్లు.
ఐదోరోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర సంజీవపురం స్టే పాయింట్ నుంచి ప్రారంభమైంది. పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి పలువురు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్, వైసీపీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారందరి భవిష్యత్ కి హామీ ఇచ్చారు. ప్రజాభిమానం చూస్తుంటే 175 స్థానాల్లో వైసీపీదే విజయం అని స్పష్టమైపోయిందని చెప్పారు జగన్.