మంగళగిరి ఏరియా ఆసుపత్రి 100 పడకలగా అప్‌గ్రేడ్
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి గా అభివృద్ధికి జీవో జారీ చేసింది ప్రభుత్వం
Advertisement
ఏపీలో మంగళగిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల దవాఖానగా అభివృద్ధికి కూటమి సర్కార్ జీవో జారీ చేసింది. అదనంగా 73 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 52.2 కోట్ల ఖర్చుతో అదనపు పడకలు, అదనపు ఉద్యోగాలను అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రి 30 పడకలగా ఉండేది. మంగళగిరి ఆసుపత్రి మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ప్రతీ ఒక్కరికీ రూ.25లక్షల వైద్య సాయం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రబుత్వం పెట్టిన 2వేల కోట్ల బకాయిలు మా ప్రబుత్వం తీర్చిందని మంత్రి తెలిపారు.
Advertisement