పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

పోలింగ్‌ రోజుతో పాటు తర్వాతి రోజు మాచర్లలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement
Update: 2024-06-26 15:19 GMT

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలోని నివాసంలో పిన్నెల్లిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్పీ ఆఫీసుకు తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల టైంలో అల్లర్లకు సంబంధించి మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఏపీ హైకోర్టు పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. ఇందుకు సంబంధించిన వీడియోలు తర్వాత సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పోలింగ్‌ రోజుతో పాటు తర్వాతి రోజు మాచర్లలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు బెయిల్‌ పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా.. ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించింది.

ఏపీలో పోలింగ్ అనంతరం పిన్నెల్లి విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్స్ ప్రచారం చేశాయి. అయితే ఆ వార్తలను ఆయన ఎప్పటకిప్పుడూ ఖండిస్తూ వచ్చారు. మాచర్ల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Tags:    
Advertisement

Similar News