తప్పుడు హామీతో లోకేష్..తండ్రి బాటలోనేనా?

2014 ఎన్నికల్లో చంద్ర‌బాబు కాపులను బీసీల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఎలాగ ఇచ్చారో ఇప్పుడు లోకేష్ కూడా అలాంటి తప్పుడు హామీనే ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పాల్సింది పోయి ఏకంగా బ్యాంకునే ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చేశారు.

Advertisement
Update:2023-02-22 11:27 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చేశారు. పాదయాత్ర యువగళంలో భాగంగా శ్రీకాళహస్తిలో ముస్లింలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని అలాగే మైనారిటి కార్పొరేషన్ పునరుద్ధరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ ఉద్దేశంలో ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ అంటే ఏమిటో? సరే షరామామూలుగానే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఎటాక్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఎలాగ ఇచ్చారో ఇప్పుడు లోకేష్ కూడా అలాంటి తప్పుడు హామీనే ఇచ్చారు. విషయం ఏమిటంటే బ్యాంకు ఏర్పాటు చేయటమన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. బ్యాంకుల ఏర్పాటన్నది రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్రప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సుంటుంది. ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంకు అంటే ఇపుడున్న‌స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల్లాంటిదనే జనాలు అనుకుంటున్నారు.

ఇదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాన్ని లోకేష్ ఎలాగ హామీ ఇచ్చారో అర్థంకావటంలేదు. మైనారిటీస్ కార్పొరేషన్ పునరుద్ధరణ అంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే కాబట్టి హామీ ఇవ్వటంలో తప్పులేదు. కానీ ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ అంటేనే ఆశ్చర్యంగా ఉంది. 2014 ఎన్నికల్లో కూడా తన పరిధిలోని కాపులకు రిజర్వేషన్ల హామీని చంద్రబాబు ఇచ్చేశారు. తర్వాత అధికారంలోకి రాగానే హామీని గాలికొదిలేశారు. ఆ తర్వాత ఆ ఇష్యూనే ఎంత కంపు అయ్యిందో అందరు చూస్తున్నదే.

తమ పరిధిలో లేని అంశాలపై హామీలివ్వటం ఎందుకు? తర్వాత వాటిని గాలికొదిలేయటం ఎందుకు? మళ్ళీ దానిపై గొడవలై శాంతిభద్రతల సమస్యగా మారితే బాధ్యత లోకేష్ తీసుకుంటారా? కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసిన కంపు ఇంకా వదల్లేదు. అలాంటిది ఇప్పుడు లోకేష్ ఇస్లామిక్ బ్యాంక్ ఎంత కంపు చేస్తుందో చూడాలి. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పాల్సిన లోకేష్ ఏకంగా బ్యాంకు ఏర్పాటు చేసేస్తామని చెప్పటం ఏమిటో అర్థం కావటంలేదు.

Tags:    
Advertisement

Similar News