ఏపీలో లిక్కర్ ధరలు పెంపు

ఏపీలో అన్ని మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.;

Advertisement
Update:2025-02-10 21:17 IST

ఏపీలో అన్ని మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల లిక్కర్ అమ్మకలపై మార్జీన్‌ను 14.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్ మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి సర్కార్ సమీక్షించింది.

అనంతరం, లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో, రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్-కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, ఈ కేబినెట్ సబ్- కమిటీ తన సిఫార్సులను కేబినెట్ కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా, మద్యం ధరలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News