రూ.1000 కోట్ల కోసం షర్మిల డ్రామాలు - కొండా రాఘవరెడ్డి
దమ్ముంటే వై.ఎస్.వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ తీసుకొని రావాలని షర్మిల, సునీతలకు సవాల్ విసిరారు రాఘవ రెడ్డి. ఈనెల 11లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై ఫైర్ అయ్యారు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవ రెడ్డి. తెలంగాణ ప్రజలను మోసం చేసి షర్మిల ఏపీలో అడుగుపెట్టడానికి చాలా కారణాలున్నాయన్నారు. ప్రతీ విషయంలోనూ చంద్రబాబును ఎత్తుకుని తిరగాల్సిన అవసరం ఏముందని షర్మిలను ప్రశ్నించారు. షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు.. కాబట్టే ఆమెకు కుటుంబం నుంచి మద్దతు కరువైందన్నారు. రూ. వెయ్యి కోట్ల పని చేయనందుకే జగన్‌కు షర్మిల వ్యతిరేకంగా మారిందన్నారు.
వైఎస్ పేరును చెడగొట్టేందుకు షర్మిల కుట్రలు చేస్తోందన్నారు రాఘవరెడ్డి. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిల ప్రచారానికి స్పందన లేకపోవడంతోనే ఆమె ఫ్రస్ట్రేషన్‌కు గురవుతోందన్నారు. బాబు, పవన్‌ల స్క్రిప్టునే షర్మిల చదువుతోందన్నారు. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందన్నారు.
దమ్ముంటే వై.ఎస్.వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ తీసుకొని రావాలని షర్మిల, సునీతలకు సవాల్ విసిరారు రాఘవ రెడ్డి. ఈనెల 11లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు. ఆ రోజు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదన్నారు. వై.ఎస్.సోదరులు సైతం షర్మిలకు మద్దతివ్వడం లేదన్నారు రాఘవరెడ్డి. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి దగ్గరకు వెళ్లారో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు. జగన్‌కు అద్దం పంపించడం కాదు.. అదే అద్దంలో షర్మిల తన ముఖం చూసుకోవాలన్నారు.