ఏసీబీ కోర్టు జ‌డ్జికి భ‌ద్ర‌త పెంపు.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

మాజీ సీఎంపై అవినీతి ఆరోప‌ణ‌ల కేసు విచారిస్తున్న నేప‌థ్యంలో.. ఇది హై ప్రొఫైల్ కేసు కావ‌డంతో న్యాయ‌మూర్తి హిమ‌బిందుకు భ‌ద్ర‌త పెంచుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Advertisement
Update:2023-09-13 07:25 IST

టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుపై సీఐడీ పెట్టిన‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణం కేసును ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న హిమ‌బిందు వాదిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త మూడు రోజులుగా ఈ అంశంపై వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ కేసులో చంద్ర‌బాబు బెయిల్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే.. కేసులో బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని భావించిన న్యాయ‌స్థానం ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న హిమ‌బిందు ఈ తీర్పు చెప్పారు.

మాజీ సీఎంపై అవినీతి ఆరోప‌ణ‌ల కేసు విచారిస్తున్న నేప‌థ్యంలో.. ఇది హై ప్రొఫైల్ కేసు కావ‌డంతో న్యాయ‌మూర్తి హిమ‌బిందుకు భ‌ద్ర‌త పెంచుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా చంద్ర‌బాబుకు హౌస్ క‌స్ట‌డీ అనుమ‌తించాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కూడా న్యాయ‌స్థానం కొట్టివేసింది. హౌస్ క‌స్ట‌డీ కంటే సెంట్ర‌ల్ జైలులోనే చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త ఎక్కువ‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌డ్జి హిమ‌బిందుకు భ‌ద్ర‌త 4+1కి పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News