ఐఐటీ మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఐఐటీ-ఎం ప్రతినిధులతో ఇవాళ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి
ఐఐటీ-ఎం ప్రతినిధులతో ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరం తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాస్ తో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది.